Chandrababu: పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu talks to family members of murdered girl in Punganuru
  • పుంగనూరులో ఏడేళ్ల బాలిక మిస్సింగ్ విషాదాంతం
  • సమ్మర్ స్టోరేజి ట్యాంకులో శవమై తేలిన అస్పియా అంజుమ్
  • బాలిక తండ్రికి ధైర్యం చెప్పిన చంద్రబాబు
చిత్తూరు జిల్లా పుంగనూరులో కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక అస్పియా అంజుమ్ సమ్మర్ స్టోరేజి ట్యాంకులో శవమై తేలడం సంచలనం సృష్టించింది. బాలికను హత్య చేసి సమ్మర్ స్టోరేజి ట్యాంకులో పడవేసినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బాలిక కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. 

ఇవాళ బాలిక నివాసానికి మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఫరూక్ వెళ్లారు. తీవ్ర విషాదంలో ఉన్న చిన్నారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారు సీఎం చంద్రబాబుతో చిన్నారి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా మాట్లాడించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు చిన్నారి తండ్రికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాగా, చిన్నారి హత్య కేసుపై హోంమంత్రి అనిత స్పందిస్తూ... ఈ వ్యవహారంలో ఐదుగురు అనుమానితులను గుర్తించామని వెల్లడించారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu
Girl
Death
Punganuru

More Telugu News