Shiva: అద్భుతం నాన్నా... నీ మాటలు నిజమయ్యాయి: నాగార్జున

Nagarjuna remembers his father words about Shiva movie
  • నాగార్జున హీరోగా... రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ చిత్రం
  • ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రం
  • శివ చిత్రం విడుదలై అక్టోబరు 6వ తేదీకి 35 ఏళ్లు 
తెలుగు చలన చిత్రసీమలో శివ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. స్క్రీన్ ప్లే, టేకింగ్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్... ఇలా ఏ అంశం చూసినా శివ సినిమాకు ముందు, శివ సినిమాకు తర్వాత అనేలా ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. సరిగ్గా ఇవాళ్టికి (అక్టోబరు 6) శివ సినిమా విడుదలై 35 సంవత్సరాలైందంటూ... టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పందించారు. 

"ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారు, నేను కార్లో వెళుతున్నాం. నిన్న రాత్రి శివ సినిమా చూశాను... ఆ సినిమా పెద్ద హిట్ అంటూ ఈ ఉదయం అందరూ చెప్పుకుంటుంటే విన్నాను... కానీ ఆ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిపోతుందని నాకనిపిస్తోంది అని మా నాన్న నాతో అన్నారు. నిజంగా అద్భుతం నాన్నా... ఆనాడు నీ మాటలు నిజమయ్యాయి. 

ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాను అభిమానిస్తున్న వాళ్లకు ధన్యవాదాలు. శివ సినిమా రూపొందడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ... ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
Shiva
Nagarjuna
ANR
RGV
Tollywood

More Telugu News