India vs Bangladesh: బంగ్లాదేశ్‌పై గెలుపుతో చరిత్ర సృష్టించిన టీమిండియా
- 128 పరుగుల లక్ష్యాన్ని 49 బంతులు మిగిలుండగానే ఛేదించిన భారత్
- అత్యధిక బంతులు మిగిలివుండగా 100 పరుగులకు పైగా లక్ష్యాన్ని అందుకున్న టీమిండియా
- మిగిలి ఉన్న బంతుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం
గ్వాలియర్‌లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. చేతిలో 7 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజలో నిలిచింది.
కాగా 128 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ మొదలుకొని హార్దిక్ పాండ్యా వరకు అందరూ తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.5 ఓవర్లలోనే చేతిలో 7 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టీమిండియా ఒక చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. ఏకంగా మరో 49 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. దీంతో టీ20ల్లో 100 పరుగులకు పైగా లక్ష్యాన్ని అత్యధిక బంతులు మిగిలి ఉండగానే గెలుపొందిన మ్యాచ్‌గా ఈ విజయం నిలిచింది. 2016లో జింబాబ్వేపై 100 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. తాజాగా బంగ్లాదేశ్‌పై దానిని అధిగమించింది.
టీ20ల్లో 100కు పైగా లక్ష్యాన్ని అధిక బంతులు మిగిలి ఉండగా భారత్ సాధించిన విజయాలు ఇవే
1. బంగ్లాదేశ్‌పై 49 బంతులు, లక్ష్యం-128 (2024లో)
2. జింబాబ్వేపై 41 బంతులు, లక్ష్యం - 100 (2016లో)
3. ఆఫ్ఘనిస్థాన్‌పై 31 బంతులు, లక్ష్యం - 116 (2010లో)
4. జింబాబ్వేపై 30 బంతులు, లక్ష్యం - 112 (2010లో)
కాగా భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 39 పరుగులు, సంజు శాంసన్ 29, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ చెరో 16 పరుగులు చేశారు.