Monkey-Dog Fight: కాలేజీ క్యాంపస్‌లో శునకంపై దాడిచేసిన మర్కటం.. భీకర పోరు.. వీడియో ఇదిగో!

Monkey and Dog Face Off in Wild College Brawl Who Wins Viral Video
  • విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నించిన కాలేజీ కుర్రాళ్లు
  • కర్రలతో కొట్టి, కుర్చీలు విసిరినా పట్టువిడవని వైనం
  • చివరికి అతికష్టం మీద శునకాన్ని వదిలి పరారైన కోతి
కాలేజీ క్యాంపస్‌లో ఓ శునకం, కోతి తలపడ్డాయి. భీకరంగా పోరాడాయి. మర్కటం బారి నుంచి శునకాన్ని విడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని వదిలేందుకు నిరాకరించింది. కర్రలతో బెదిరించినా, కుర్చీలు ఎత్తిపడేసినా కుక్కను మాత్రం అది వదల్లేదు. నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. మరోవైపు, శునకం కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. క్యాంపస్‌లోని విద్యార్థులే కాదు, స్థానికులు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది.  కాలేజీ కుర్రాళ్లు, స్థానికులు సైతం వాటిని విడిపించేందుకు ప్రయత్నించారు. చివరికి కోతి అతి కష్టం మీద శునకాన్ని వదిలి పరారైంది.  

ఈ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు. వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ రెండింటికీ ఏమైనా శత్రుత్వం ఉందేమో అని ఒకరంటే, పోటీ తీవ్రంగా ఉందని ఇంకొకరు కామెంట్ చేశారు. కుక్కకు, కోతికి మధ్య ఉన్నది జాతి శత్రుత్వమని, అందుకే అవి అంతగా తలపడుతున్నాయని మరొకరు వ్యాఖ్యానించారు.
Monkey-Dog Fight
College Campus
Viral Video

More Telugu News