Sunita Willams: భూమికి 400 కి.మీ. పైనుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్

Sunita Williams to vote in US Presidential elections from space
  • ఐఎస్ఎస్ నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్న సునీత
  • తొలి మహిళగా రికార్డులకెక్కనున్న సునీత విలియమ్స్
  • ఐఎస్ఎస్ నుంచి ఓటు వేసిన తొలి ఆస్ట్రోనాట్‌గా డేవిడ్ వోల్ఫ్ రికార్డ్
నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వినియోగించుకోనున్నారు. ఐఎస్ఎస్‌లో కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె భూమికి 400 కిలోమీటర్ల పైనుంచి తన ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోబోతున్నారు. 

అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు 1997లో అందుబాటులోకి వచ్చింది. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న తొలి అమెరికన్‌గా డేవిడ్ వోల్ప్ రికార్డులకెక్కారు. మిర్ స్పేస్ స్టేషన్ నుంచి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత (2020) ఎన్నికల్లో కేట్ రూబిన్స్ కూడా ఇలానే ఓటేశారు. ఇప్పుడు సునీత కూడా వారి సరసన చేరనున్నారు. 

విదేశాల్లో ఉన్న అమెరికన్లు ఎలాగైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో అలానే సునీత కూడా ఓటేయనున్నారు. సునీత తొలుత ఫెడరల్ పోస్ట్ కార్డు అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చాక ఐఎస్ఎస్ కంప్యూటర్ సిస్టం నుంచి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పద్ధతిలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకుంటారు.
Sunita Willams
NASA
ISS
US Presidential Polls

More Telugu News