Nagarjuna: మంత్రి సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా... రేపు నాగార్జున వాంగ్మూలం న‌మోదు

Defamation Suit Filed by Nagarjuna Hearing Adjourned Tomorrow
  • స‌మంత‌-నాగ‌చైత‌న్య విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు
  • నాంప‌ల్లి కోర్టులో ప‌రువున‌ష్టం దావా వేసిన‌ నాగార్జున
  • ఇవాళ నాగ్ పిటిష‌న్‌ను విచారించిన న్యాయ‌స్థానం
  • మంగ‌ళ‌వారం పిటిష‌న‌ర్ వాంగూల్మం రికార్డు చేస్తామ‌ని వెల్ల‌డి  
త‌న కుటుంబ వ్య‌వ‌హారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన ప‌రువున‌ష్టం పిటిష‌న్‌ను నాంప‌ల్లి కోర్టు ఇవాళ విచారించింది. నాగ్ త‌ర‌ఫున ఆయ‌న న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. 

అనంత‌రం, పిటిష‌న‌ర్ నాగార్జున వాంగ్మూలాన్ని మంగ‌ళ‌వారం రికార్డు చేస్తామ‌ని న్యాయ‌స్థానం తెలిపింది. దీంతో రేపు ఆయ‌న కోర్టులో హాజ‌రుకానున్నారు. నాగ్‌తో పాటు సాక్షుల వాంగ్మూలాల‌ను కూడా న‌మోదు చేయాల‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. త‌దుప‌రి విచార‌ణ‌ను న్యాయ‌స్థానం రేప‌టికి వాయిదా వేసింది. 

ఇదిలాఉంటే.. స‌మంత‌-నాగ‌చైత‌న్య విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. మంత్రి వ్యాఖ్య‌లు త‌మ కుటుంబ ప‌రువుకు భంగం క‌లిగించాయ‌ని ఆమెపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాగార్జున నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త గురువారం మంత్రి సురేఖ‌పై ప‌రువున‌ష్టం దావా వేశారు.
Nagarjuna
Defamation Suit
Konda Surekha
Nampally Court

More Telugu News