Prabhas Marriage: ఆ రోజు త్వరలోనే వస్తుంది.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి బిగ్ అప్టేట్

Soon Will Come That Day Shyamala Devi Responds About Prabhas Marriage
  • బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న శ్యామలాదేవి
  • ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన 
  • వదినమ్మ ఎవరంటూ వెతుకులాట మొదలెట్టేసిన ఫ్యాన్స్
టాలీవుడ్ అగ్ర నటుడు ప్రభాస్ పెళ్లి విషయంలో మరింత క్లారిటీ వచ్చేసింది. ఆ రోజు త్వరలోనే రానుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పారు. నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుందని పేర్కొన్నారు. 

అమ్మవారి ఆశీస్సులతోపాటు పై నుంచి కృష్ణంరాజు దీవెనలు కూడా ప్రభాస్‌పై ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు. ప్రభాస్ పెళ్లిపై ఆమె క్లారిటీతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కాబోయే వదిన ఎవరో? అంటూ అప్పుడే వెతుకులాట మొదలెట్టేశారు. కాగా, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ రానుండగా, ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీలో నటిస్తున్నాడు.
Prabhas Marriage
Prabhas
Tollywood

More Telugu News