Vinesh Phogat: హర్యానా ఫలితాలు... వెనుకంజలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్

Phogat trailing by over 1500 votes in Haryana Elections
  • కాంగ్రెస్ అభ్యర్థిగా జులానా నుంచి బరిలో నిలిచిన ఫొగాట్
  • ఆరో రౌండ్ ముగిసేసరికి 1200 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి
  • హర్యానాలో మేజిక్ ఫిగర్ దాటి బీజేపీ ముందంజ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కవిత దలాల్, జేజేపీ నుంచి అమర్జీత్ దాండా, బీజేపీ నుంచి యోగేశ్ బైరాగి బరిలో నిలిచారు. ఈ వార్త రాసే సమయానికి, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్‌పై బీజేపీ అభ్యర్థి యోగేశ్ దాదాపు 1,200 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. నాలుగో రౌండ్‌లో 3 వేల ఓట్లు, ఐదో రౌండ్‌లో 1,417 ఓట్లు, 6 రౌండ్ ముగిసేసరికి 1,200 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

హర్యానాలో తొలుత బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ కనిపించింది. కానీ ఆ తర్వాత బీజేపీ దూసుకెళ్లింది. బీజేపీ 48 సీట్లలో, కాంగ్రెస్ 34 సీట్లలో ఆధిక్యంలో నిలిచాయి. ఐఎన్ఎల్‌డీ, బీఎస్పీ, ఐఎన్‌డీ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి.
Vinesh Phogat
Congress
BJP
Haryana
Assembly Elections

More Telugu News