BJP: హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ తప్పాయి... ఆధిక్యంలో బీజేపీ

BJP wins Haryana assembly elections for third time in a row
  • ఇటీవల హర్యానాలో పోలింగ్ పూర్తి 
  • కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్
  • వెనుకంజలో కాంగ్రెస్
ఇటీవల హర్యానా, జమ్మూ కశ్మీర్ లో పోలింగ్ పూర్తి కాగా, ఎగ్జిట్ పోల్స్ లో హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, జమ్మూ కశ్మీర్ లో సంకీర్ణం వస్తుందని ఊదరగొట్టారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి. 

హర్యానాలో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా... ఇప్పటివరకు బీజేపీ 4 స్థానాలు గెలిచి 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... కాంగ్రెస్ 9 స్థానాలు గెలిచి 27 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46 కాగా... బీజేపీ ఆ సంఖ్యను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
BJP
Haryana
Assembly Elections

More Telugu News