Vinesh Phogat: హర్యానాలో గెలుపుపై స్పందించిన వినేశ్ ఫొగాట్

Vinesh Phogat wins calls maiden election win victory of truth
  • పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి గెలుపుగా పేర్కొన్న ఫొగాట్
  • ఈ దేశం తనకు ఇచ్చిన ప్రేమను ఎప్పటికీ నిలబెట్టుకుంటానన్న వినేశ్
  • ఆ రెజ్లర్లు హీరోలు కాదన్న బీజేపీ నేత బ్రిజ్ భూషణ్
హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన గెలుపుపై మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేశ్ ఫొగాట్ స్పందించారు. ఇక్కడి నుంచి సమీప బీజేపీ అభ్యర్థిపై ఆమె 6 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. తన గెలుపు అనంతరం ఆమె మాట్లాడుతూ... ఇది ఎల్లప్పుడూ దేశంలో పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి గెలుపు అన్నారు. మహిళల పోరాటం వృథా కాదని ప్రజలు నిరూపించారని వ్యాఖ్యానించారు. ఈ దేశం తనకు ఇచ్చిన ప్రేమను ఎప్పటికీ నిలబెట్టుకుంటానన్నారు.

వారు హర్యానా హీరోలు కాదు: బీజేపీ నేత బ్రిజ్ భూషణ్

జాట్ మెజార్టీగా ఉన్న సీట్లను బీజేపీ గెలుచుకుందని బ్రిజ్ భూషణ్ అన్నారు. రెజ్లర్ల ఆందోళనలో పాల్గొన్న కొంతమంది రెజ్లర్లను హర్యానా రాష్ట్ర హీరోలుగా చెప్పలేమని వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి అన్నారు. అసలు జూనియర్ రెజ్లర్లందరికీ వారే విలన్లు అని విమర్శించారు. కొంతమంది తమ గెలుపు కోసం నా పేరును వినియోగించుకున్నారంటే వారు గెలవడానికి నేను దోహదపడినట్లే అన్నారు. హర్యానాలో ఆమె గెలిచినా, అది కాంగ్రెస్ పార్టీ గెలుపు అనే విషయాన్న గుర్తించాలన్నారు.
Vinesh Phogat
Congress
Haryana

More Telugu News