Srinu Vaitla: కామెడీ సీన్స్ తీసేటప్పుడు భయపడతాను: డైరెక్టర్ శ్రీను వైట్ల!

Srinu Vaitla Interview
  • కామెడీ తీయడం కష్టమన్న శ్రీను వైట్ల 
  • ముందురోజు తాను నిద్రపోనని వెల్లడి 
  • విశ్వనాథ్ గారు మెచ్చుకున్నారని వ్యాఖ్య 
  • 'విశ్వం'లో తన మార్క్ కామెడీ ఉంటుందని వివరణ 

శ్రీను వైట్ల సినిమాలకి కామెడీ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. ఆయన డిజైన్ చేసిన కామెడీ సీన్స్ తలచుకుని నవ్వుకునేలా ఉంటాయి. ఆయన ఫ్లాప్ సినిమాలలోని కామెడీ సీన్స్ ను కూడా ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. అలాంటి శ్రీను వైట్ల నుంచి త్వరలో 'విశ్వం' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జర్నలిస్ట్ 'ప్రేమ'తో శ్రీను వైట్ల మాట్లాడుతూ అనేక విషయాల గురించి ప్రస్తావించారు. 

"'విశ్వం' సినిమాలోనూ గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, నా మార్కు కామెడీ కనిపిస్తుంది. నా సినిమాలలో కామెడీ ఎపిసోడ్స్ బాగుంటాయనే ఒక నమ్మకం ఆడియన్స్ కి ఉంది. అలాంటి కామెడీ సీన్స్ ను ఆశించే వాళ్లు థియేటర్స్ కి వస్తుంటారు. వాళ్లకి నచ్చేలా కామెడీని షూట్ చేసే విషయంలో నిజంగానే నేను భయపడుతూ ఉంటాను" అని అన్నారు. 

"నేను యాక్షన్ .. ఎమోషన్స్ వంటివి షూట్ చేసేటప్పుడు పెద్దగా టెన్షన్ పడను. కానీ కామెడీని షూట్ చేసేటప్పుడు మాత్రం చాలా భయపడతాను. కామెడీ టైమింగ్ పెర్ఫెక్ట్ గా లేకపోతే, అదే మైనస్ గా మారిపోతుంది. అందువలన కామెడీ సీన్స్ చేయడానికి ముందురోజు నేను నిద్ర కూడా పోను. ఎక్కువ మంది ఆర్టిస్టులతో కామెడీని రన్ చేయడం అంత ఆషామాషీ కాదని విశ్వనాథ్ గారు మెచ్చుకోవడం నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన" అని చెప్పారు.
Srinu Vaitla
Gopichand
Vishwam

More Telugu News