Jagan: ఏపీలాంటి ఫలితాలే వచ్చాయి.. పేపర్ బ్యాలెట్ కు వెళ్లాల్సిన సమయం ఇది: హర్యానా ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Jagan sensational comments on Haryana results

  • హర్యానా ఎన్నికల ఫలితాలు గందరగోళానికి గురి చేస్తున్నాయన్న జగన్
  • ఏపీ ఫలితాలకు.. హర్యానా ఫలితాలు భిన్నంగా లేవని వ్యాఖ్య
  • యూఎస్ సహా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నాయన్న జగన్

హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ బ్యాలట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని ఆయన అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. 'మరో ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు... హర్యానా ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవు. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ సాధించాలంటే ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం. 

అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం కూడా పేపర్ బ్యాలట్ వైపు వెళ్లే సమయం ఇది. పేపర్ బ్యాలెట్ ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి' అని జగన్ అన్నారు. 

  • Loading...

More Telugu News