Piyush Goyal: రతన్ టాటాతో అనుబంధాన్ని గుర్తు చేసుకొని పీయూష్ గోయల్ కంటతడి

Piyush Goyal tears up on air while remembering Ratan Tata
  • కొన్నేళ్ల క్రితం రతన్ టాటా తన ఇంటికి వచ్చాడన్న పీయూష్ గోయల్
  • అల్పాహారం చేస్తున్న సమయంలో దోశ, ఇడ్లీ, వడ, సాంబార్ మాత్రమే తిన్నారని వెల్లడి
  • సాధారణ జీవితంతోనే సంతోషంగా ఉంటారని తెలుసుకున్నానన్న కేంద్రమంత్రి
రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కంటతడి పెట్టారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గత అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన మృతి పట్ల యావత్ భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై పీయూష్ గోయల్ స్పందించారు. 

చాలా ఏళ్ల క్రితం రతన్ టాటా తమ ఇంటికి వచ్చారని, అల్పాహారం చేస్తున్న సమయంలో ఆయన కేవలం ఒక దోశ, ఇడ్లీ, వడ, సాంబార్ మాత్రమే తీసుకున్నారని తెలిపారు. ఆయన సాధారణ జీవితంతోనే ఎంతో సంతోషంగా ఉంటారని అప్పుడే తనకు తెలిసిందన్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు తన భార్య మనసులోని భావాన్ని అర్థం చేసుకొని... మీరు నాతో ఫొటో తీసుకోవాలనుకుంటున్నారా? అని అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం మధుర జ్ఞాపకం అన్నారు.
Piyush Goyal
Ratan Tata
BJP

More Telugu News