Konda Surekha: కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

Nampally court issues notices to Konda Surekha
  • నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నోటీసులు జారీ
  • రెండో సాక్షి స్టేట్ మెంట్ రికార్డు చేసిన కోర్టు
  • తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా 
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దాఖలు కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. అనంతరం తదుపరి విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. 

నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈరోజు రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డ్ చేసింది. రెండు రోజుల క్రితమే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది.

కొండా సురేఖ త‌న కుటుంబ గౌర‌వాన్ని, ప్ర‌తిష్ఠను దెబ్బ‌తీసేలా నిరాధార వ్యాఖ్య‌లు చేశార‌ని, చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాగార్జున నాంపల్లి ప్రత్యేక కోర్టులో ప‌రువు న‌ష్టం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 

ఇటీవల నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున పేరును కూడా లాగారు. దీంతో ఆయన పరువునష్టం దావా వేశారు.
Konda Surekha
Nagarjuna
KTR
Naga Chaitanya
Samantha

More Telugu News