Chiranjeevi: చిరంజీవి సినిమా సెట్స్ పై ఇద్దరు భామలతో వెంకీ మామ సందడి

Venkatesh met Chiranjeevi on sets
  • చిరంజీవి హీరోగా విశ్వంభర
  • వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో ఎస్వీసీ58
  • మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ లతో కలిసి విశ్వంభర సెట్స్ పైకి వెంకటేశ్ 
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా, చిరంజీవి సినిమా సెట్స్ పై విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. వెంకటేశ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎస్వీసీ58 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యరాజేశ్ నటిస్తున్నారు. 

ఇవాళ వెంకటేశ్, అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్... విశ్వంభర సెట్స్ పై చిరంజీవిని కలిశారు. రెండు చిత్రాల షూటింగ్ లు పక్కపక్కనే జరుగుతుండడంతో కోలాహలం నెలకొంది. 

వెంకీ మామ, అనిల్ రావిపూడి, ఐశ్వర్య, మీనాక్షిలను చిరంజీవి విశ్వంభర సెట్స్ పైకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి మధ్య సరదా క్షణాలు చోటుచేసుకున్నాయి.
Chiranjeevi
Vishwambhara
Venkatesh
SVC58
Aishwarya Rajesh
Meenakshi Choudhary
Anil Ravipudi
Tollywood

More Telugu News