Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు .. గ్రామాలకు అధికారుల బృందాలు

DY CM Pawan Kalyan Key Orders on problem in Pithapuram

  • పిఠాపురంలో సమస్యలు గుర్తించేందుకు జిల్లా స్థాయి అధికారులను నియమించిన కాకినాడ కలెక్టర్
  • నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారుల బృందం
  • సమస్యలపై నివేదిక అందిన తర్వాత స్వయంగా పరిశీలించనున్న పవన్ కల్యాణ్ 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో గల గ్రామ పంచాయతీల్లో, పిఠాపురం మన్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ కు దిశానిర్దేశం చేశారు. 

అన్ని శాఖలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం పాల్గొని తనిఖీలు చేపట్టాలని, సమస్యలను గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. దీంతో కాకినాడ కలెక్టర్ .. జిల్లా అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులను నియమించారు. ఆయా అధికారులు నియోజకవర్గంలోని పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని అన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్కడి పరిస్థితులు తనిఖీ చేస్తూ, సమస్యలను గుర్తిస్తూ నివేదికను సిద్దం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. పరిశీలన పూర్తి అయన తర్వాత ఆ నివేదకలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలన చేస్తారని డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొంది.   
.

  • Loading...

More Telugu News