Nara Brahmini: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న నారా బ్రాహ్మిణి

Nara Brahmini offers prayers at Peddamma Thalli Temple
  • బ్రాహ్మిణికి తీర్థప్రసాదాలు అందించిన పూజారులు
  • జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయానికి తరలి వచ్చిన భక్తులు
  • అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు.

దసరా పర్వదినం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దర్శనం కోసం వేలాదిమంది తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూకట్టిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.

ఈరోజు పెద్దమ్మతల్లి ఆలయంలో వాహనపూజ నిర్వహించనున్నారు. వాహనపూజ నేపథ్యంలో చాలామంది భక్తులు తమ వాహనాలను గుడికి తీసుకువచ్చారు. దేశంలో ఈరోజు శరన్నవరాత్రులు ముగియనున్నాయి. ఈరోజు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
Nara Brahmini
Telugudesam
Jubilee Hills
Peddamma Thalli Temple

More Telugu News