Team India Players: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న టీమిండియా ఆట‌గాళ్లు

Team India Players Visited Jubilee Hills Peddamma Thalli
  • ద‌స‌రా సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న తిల‌క్ వ‌ర్మ‌, నితిశ్ కుమార్
  • అమ్మ‌వారి ఆల‌యంలో ఇద్ద‌రు ప్ర‌త్యేక పూజ‌లు 
  • ఈ రోజు రాత్రి 7 గంట‌ల‌కు ఉప్ప‌ల్ వేదిక‌గా బంగ్లా, భార‌త్ మూడో టీ20
బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్న విష‌యం తెలిసిందే. ఇవాళ‌ విజ‌య ద‌శ‌మి కావ‌డంతో తెలుగు ప్లేయ‌ర్లు తిల‌క్ వ‌ర్మ‌, నితిశ్ కుమార్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ‌త‌ల్లిని ద‌ర్శించుకున్నారు. శ‌నివారం నాడు అమ్మ‌వారి ఆల‌యంలో ఈ ఇద్ద‌రు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. 

ఇక, ఈ రోజు రాత్రి 7 గంట‌ల‌కు ఉప్ప‌ల్ వేదిక‌గా బంగ్లా, భార‌త్ ఆఖ‌రిదైన మూడో టీ20లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవ‌సం చేసుకుంది. చివ‌రి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాల‌ని భార‌త జ‌ట్టు చూస్తోంది. మ‌రోవైపు బంగ్లా టైగ‌ర్స్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని భావిస్తోంది.
Team India Players
Tilak Varma
Nitish Kumar Reddy
Jubilee Hills Peddamma Thalli
Hyderabad
Telangana

More Telugu News