Mohammed Siraj: డీఎస్పీ సిరాజ్... పోలీస్ యూనిఫాంలో టీమిండియా బౌలర్... ఫొటో వైరల్

Mohamed Siraj in DSP uniform pic goes viral
  • టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా
  • వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో సభ్యుడిగా ఉన్న సిరాజ్
  • ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 హోదాతో ఉద్యోగం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
  • డ్యూటీలో చేరిన టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్
టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ డీజీపీ జితేందర్ నిన్న సిరాజ్ కు పోలీస్ డిపార్ట్ మెంట్ తరఫున అపాయింట్ మెంట్ లెటర్ అందజేశారు.

ఈ నేపథ్యంలో, డీఎస్పీ యూనిఫాంలో ఉన్న మహ్మద్ సిరాజ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరాజ్ యూనిఫాం ధరించి, విధుల్లో చేరేందుకు వచ్చినట్టుగా ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది. 

టీమిండియా ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఈ జట్టులో సిరాజ్ కూడా సభ్యుడు. దాంతో, సిరాజ్ ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 హోదాతో  డీఎస్పీ ఉద్యోగం కూడా ఇచ్చింది.
Mohammed Siraj
DSP
Police
Telangana
Team India

More Telugu News