CPI Narayana: నాగార్జున పరువు ఎప్పుడో పోయింది: సీపీఐ నారాయణ

CPI Narayana describes Nagarjuna defamation case on Konda Surekha was a joke
  • ఇటీవల అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు
  • కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన నాగార్జున
  • బిగ్ బాస్ షోతో నాగార్జున పరువు ఎప్పుడో పోయిందన్న నారాయణ
  • కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉందంటూ ఎద్దేవా
ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు వేశారు. ఎవరైనా పరువు కలిగినోళ్లు పరువునష్టం దావా వేస్తారు కానీ... పరువులేని నాగార్జున పరువునష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. 

"పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాడా? బిగ్ బాస్ షోతో పరువు పోగొట్టుకున్న నాగార్జున ఇప్పుడు కొండా సురేఖపై పరువునష్టం దావా వేశాడు. సమంత లాంటి వాళ్లు పరువునష్టం దావా వేస్తే అర్థం ఉంది కానీ... బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అన్ పాప్యులర్ అయిన నాగార్జున పరువునష్టం దావా వేయడం అంటే అంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. 

కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన తర్వాత ఇక దానిపై ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నాగార్జున వంటి వ్యక్తి పరువునష్టం దావా వేయడం చూస్తుంటే ఓ జోక్ లా అనిపిస్తోంది" అని నారాయణ ఎద్దేవా చేశారు.
CPI Narayana
Nagarjuna
Defamation Case
Konda Surekha
Akkineni Family
Hyderabad

More Telugu News