Baba Siddique Murder: బాబా సిద్ధిఖీని చంపింది మేమే... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన

Lawrence Bishnoi gang takes responsibility of Baba Siddique murder
  • మహారాష్ట్రలో తీవ్ర సంచలనం
  • మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య
  • ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... పరారీలో మరొకరు
  • బాబా సిద్ధిఖీ... సల్మాన్ ఖాన్ సన్నిహితుడిగా గుర్తింపు
  • సల్మాన్ ను ఎప్పటినుంచో టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. దుండగులు 9 ఎంఎం పిస్టళ్లతో కాల్పులు జరపడంతో బాబా సిద్ధిఖీ కుప్పకూలిపోయారు. కాగా, బాబా సిద్ధిఖీని చంపింది తామేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్ధిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. 

సిద్ధిఖీని అంతమొందించేందుకు నిందితులు నెల రోజులుగా రెక్కీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సిద్ధిఖీ హత్య కోసం నిందితులు ఒక్కొక్కరికి రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చినట్టు వెల్లడైంది. వీరికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయుధాలు అందించినట్టు తెలిసింది. 

హత్యకు గురైన బాబా సిద్ధిఖీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను ఎప్పటినుంచో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సన్నిహితుడినే హత్య చేసిన నేపథ్యంలో, సల్మాన్ ఖాన్ భద్రతపై ఆందోళన నెలకొంది. దాంతో, ముంబయిలోని సల్మాన్ నివాసం వద్ద భద్రత పెంచారు.
Baba Siddique Murder
Lawrence Bishnoi Gang
Mumbai
Police
Salman Khan
Bollywood
Maharashtra

More Telugu News