Kalyan Jewellers: కల్యాణ్ జ్యుయెలర్స్ యజమాని ఇంట నవరాత్రి వేడుకలకు చిరంజీవి, నాగార్జున... ఫొటోలు ఇవిగో!

Chiranjeevi and Nagarjuna attends Kalyan Jewellers Navaratri celebrations
  • కేరళలోని త్రిసూర్ లో టీఎస్ కల్యాణరామన్ ఇంట దసరా సంబరాలు
  • చిరంజీవి, నాగార్జునలకు ప్రత్యేక ఆహ్వానం
  • కల్యాణ్ జ్యుయెలరీ అధినేత ఇంట సందడి చేసిన చిరు, నాగ్
ప్రముఖ బంగారు, వెండి ఆభరణాల తయారీదారు కల్యాణ్ జ్యుయెలర్స్ సంస్థ యజమాని టీఎస్ కల్యాణరామన్ ఇంట దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేరళలోని త్రిసూర్ లో జరిగిన ఈ శరన్నవరాత్రి సంబరాలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా హాజరయ్యారు. 

కల్యాణ్ జ్యుయెలర్స్ ఎండీ టీఎస్ కల్యాణరామన్ ఆహ్వానం మేరకు చిరంజీవి, నాగార్జున ప్రత్యేక విమానంలో త్రిసూర్ వెళ్లారు. ఈ వేడుకల్లో కల్యాణరామన్ తో కలిసి చిరంజీవి, నాగార్జున జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బొమ్మల కొలువును సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Kalyan Jewellers
Navaratri Celebrations
Chiranjeevi
Nagarjuna
Trissur
Kerala
Tollywood

More Telugu News