Rahul Dravid: రోహిత్ శర్మ, కోహ్లీలను కలిసిన మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్.. వైరల్ వీడియో ఇదిగో
- భారత్ - న్యూజిలాండ్ మధ్య బెంగళూరులో బుధవారం తొలి టెస్ట్ మ్యాచ్
- చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న స్టార్ ఆటగాళ్ల వద్దకు మాజీ కోచ్
- ప్లేయర్స్‌తో సరదాగా ముచ్చటించిన రాహుల్ ద్రావిడ్
భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని నెలల సుదీర్ఘ విరామం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, యువ బ్యాటర్ రిషబ్ పంత్‌లను కలిశాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ఈ ప్లేయర్లను ద్రావిడ్ కలిశాడు. ప్రాక్టీస్ సెషన్‌ను ఆకస్మికంగా సందర్శించి ఆటగాళ్లకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కొద్ది సమయం అక్కడ గడిపి ఆటగాళ్లతో సరదాగా మాట్లాడాడు. ద్రావిడ్‌తో పలువురు ఆటగాళ్లు ముచ్చటిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 ప్రపంచ కప్ 2024తో టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగిసిపోయిన విషయం తెలిసిందే.
కాగా భారత్ - న్యూజిలాండ్ మధ్య బుధవారం తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ నాయకత్వంలోని జట్టు సన్నద్దమవుతోంది. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కాగా భారత పర్యటనకు ముందు న్యూజిలాండ్.. శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అక్కడ 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. దీనికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ప్లేయర్ సౌతీ వైదొలిగాడు. దీంతో టామ్ లాథమ్ న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు.