Bandi Sanjay: బండి సంజయ్‌ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి

Malla Reddy meets Bandi Sanjay
  • మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం
  • ఆహ్వాన పత్రికను అందించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు
  • ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పత్రిక ఇచ్చిన మల్లారెడ్డి
కేంద్ర సహాయమంత్రి, బీజేపీ సీనియర్ ఎంపీ బండి సంజయ్‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు శ్రేయ వివాహానికి ఆహ్వానించేందుకు గాను వారు కేంద్ర సహాయమంత్రిని కలిశారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.

మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇటీవల పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తూ ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. అంతకుముందు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తదితరులను కూడా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
Bandi Sanjay
BJP
Ch Malla Reddy
Rajasekhar Reddy

More Telugu News