Chandrababu: ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

CM Chanadrababu reviews on IT Electronics and Drone policies
  • చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు
  • ఎలక్ట్రానిక్స్ పాలసీపై సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు
  • డ్రోన్ పాలసీ, ఐటీ పాలసీ మెరుగుపర్చాలని సూచన
సీఎం చంద్రబాబు నేడు డ్రోన్ పాలసీ, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీలపై ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్టు తెలిపారు.

ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకురావాలని సూచించారు. అదే విధంగా ఐటీ పాలసీ, డ్రోన్ పాలసీపైనా ముఖ్యమంత్రి చర్చించారు. వీటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

ఈనెల 22, 23వ తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తుండడం తెలిసిందే. దీనిపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ భాగస్వామ్యంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.
Chandrababu
IT-Electronics-Drone Policies
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News