Naga Chaitanya: పుకార్లపై స్పందించిన నాగ చైతన్య టీమ్

naga chaitanya team condems rumours
  • మరో వెబ్‌ సిరీస్‌లో నాగ చైతన్య నటిస్తున్నారంటూ ప్రచారం
  • ఆ ప్రచారం నిజం కాదని వెల్లడించిన చైతన్య టీమ్
  • పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'తండేల్' మూవీపైనే దృష్టి పెట్టారని వెల్లడి
అక్కినేని నాగ చైతన్య మరో వెబ్‌ సిరీస్‌లో నటించనున్నారని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఆ ప్రాజెక్టుపై సంతకం చేశారని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై నాగ చైతన్య టీమ్ స్పందిస్తూ, ఆ వార్తలను ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. 
 
ప్రస్తుతం నాగ చైతన్య 'తండేల్' మూవీపైనే దృష్టి పెట్టారని టీమ్ తెలిపింది. నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌ సిరీస్ 'దూత' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన మరో సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో ఆ రూమర్స్‌ను టీమ్ ఖండించింది. 
 
కాగా, ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న 'తండేల్' పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' మూవీ తెరకెక్కిస్తున్నారు. దేశభక్తి అంశాలతో పాటు ప్రేమకథతో రూపొందుతున్న ఈ మూవీలో రాజు అనే మత్స్యకారుడుగా నాగ చైతన్య నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తోంది.   
Naga Chaitanya
Movie News

More Telugu News