Depression: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం

IMD says depression will be formed in Bay Of Bengal next 24 hours
  • దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం
  • పశ్చిమ వాయవ్య దిశగా పయనం
  • ఏపీలో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది. 

ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఈ వాయుగుండం పయనిస్తుందని, అదే సమయంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వెల్లడించింది. ఏపీలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  

ఇక, నైరుతి రుతుపవనాలు నేటితో దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నాయని, నేటి నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమైనట్టు ఐఎండీ అమరావతి తెలిపింది.
Depression
Bay Of Bengal
IMD
Rain Alert
Andhra Pradesh
Tamil Nadu

More Telugu News