Predator Drones: హిందూ మహాసముద్రంపై భారత్ డేగ కన్ను... అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు

India inked deal with US to procure Predator drones
  • హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం తగ్గించడంపై భారత్ దృష్టి
  • ఈ ప్రాంతంలోకి తరచుగా వస్తున్న చైనా యుద్ధనౌకలు
  • మానవ రహిత నిఘా విమానాలుగా ప్రిడేటర్ ఎంక్యూ 9డీ డ్రోన్లకు గుర్తింపు
హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాబల్యం పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుండడం తెలిసిందే. ఇటీవల చైనా యుద్ధ నౌకలు తరచుగా హిందూ మహాసముద్రంలో ప్రవేశిస్తున్నాయి. ఈ క్రమంలో హిందూ మహాసముద్రంపై డేగ కన్ను వేసేందుకు భారత్ కీలక డ్రోన్లు కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. 

నిఘా కార్యకలాపాలకు ఉపయోగించే అత్యంత సమర్థవంతమైన ప్రిడేటర్ డ్రోన్లను సమకూర్చుకోవాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం... ఈ దిశగా కీలక ముందడుగు వేసింది. 

ఈ 31 ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోలు కోసం రూ.32 వేల కోట్లతో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై రెండు దేశాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ 31 ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్లలో భారత నేవీకి 15, ఆర్మీకి 8, వాయుసేనకు 8 అప్పగించనున్నారు. 

ఈ డ్రోన్ల సాయంతో హిందూ మహాసముద్రంపై భారత నిఘా శక్తి మరింత పెరగనుంది. ప్రిడేటర్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధరంగాల్లో నమ్మకమైన మానవ రహిత నిఘా విమానాలుగా పేరుపొందాయి. వీటిని అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ తయారుచేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం ఖరారైంది.
Predator Drones
MQ 9B
Surveillance
India
USA
Indian Ocean
China

More Telugu News