Realme P1 Speed 5G: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. తొలిసారి వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ విడుదల.. రేట్ల వివరాలు ఇవే

Realme has launched a new smartphone Realme P1 Speed 5G in in India and Here are details
  • ‘రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ విడుదల
  • ధర రూ.17,999-రూ.20,999గా ప్రకటన
  • భారత్‌‌లో తొలిసారి వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను కూడా ఆవిష్కరించిన రియల్‌మీ
ఫోన్ల తయారీ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. బ్రష్డ్ బ్లూ, టెక్స్చర్డ్ టైటానియం రంగులలో ఈ ఫోన్ లభిస్తుంది. ధర విషయానికి వస్తే 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ బేస్ మోడల్  రూ.17,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌ హై-ఎండ్ వేరియంట్ ధర రూ. 20,999గా కంపెనీ ప్రకటించింది. అయితే కస్టమర్లు రూ.2000 వరకు పరిమిత తగ్గింపు ఆఫర్‌ను పొందొచ్చని పేర్కొంది. అక్టోబర్ 20న భారతకాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభవుతాయి. రియల్‌మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. కాగా ‘రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీ’ స్మార్ట్‌ఫోన్ పీ1 సిరీస్‌‌లో భాగంగా విడుదలైంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రియల్‌మీ పీ1 5జీ, రియల్‌మీ పీ1 ప్రో 5జీ, రియల్‌మీ పీ2 ప్రో 5జీ ఫోన్లు విడుదలయ్యాయి. 

ఫోన్ ఫీచర్లు ఇవే
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్, వేడి నియంత్రణ కోసం 6,050ఎంఎం స్క్వేర్ స్టెయిన్‌లెస్ స్టీల్ వీసీ కూలింగ్ ఏరియా, 45వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్‌, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాలతో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. 1,080x2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.67 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. 2,000 నిట్‌ల బ్రైట్‌నెస్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే, 50-మెగాపిక్సెల్ ఏఐ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు ఉంటుంది.

వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ విడుదల
మరోవైపు భారతదేశంలో రియల్‌మీ కంపెనీ తన మొట్టమొదటి వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ఆవిష్కరించింది. రియల్‌మీ టెక్‌లైఫ్ స్టూడియో హెచ్1 పేరిట విడుదల చేసింది. ఈ హెడ్‌ఫోన్స్ ధర రూ.4,999గా ఉంది. నలుపు, ఎరుపు, తెలుపు రంగులలో లభిస్తున్న ఈ హెడ్‌సెట్‌పై ప్రారంభ ఆఫర్ కింద రూ.500 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
Realme P1 Speed 5G
Realme Techlife Studio H1
Realme
Tech-News

More Telugu News