Prithviraj Sukumaran: జయేద్ మసూద్‌గా పృథ్విరాజ్‌ సుకుమారన్‌

Prithviraj Sukumaran as Zayed Masood
  • లూసిఫర్‌కు రీమేక్‌గా L2 ఎంపురాన్ చిత్రం 
  • L2 ఎంపురాన్‌లో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న పృథ్విరాజ్‌ 
  • పుట్టినరోజు సందర్భంగా జయేద్‌ మసూద్‌ లుక్‌ విడుదల
‘లూసిఫర్’ 2019లో విడుద‌లై  విజ‌యాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ  చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ రాబోతోంది.  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ ఈ సీక్వెల్‌ని నిర్మిస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు మోహ‌న్‌లాల్ హీరోగా రాబోతున్న ఈ చిత్రంలో పలువురు దక్షిణాది తారలు నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ దర్శకుడు. తొలి భాగం హిట్ కావ‌టంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. 

మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేష‌న్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఇటీవల మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్ర‌మ్‌గా ఆయన లుక్‌ను విడుద‌ల చేశారు. ఇక ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఖురేషి అబ్రమ్‌కు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించనున్నారు. 

ఎంపరర్ జనరల్ అంటూ జయేద్ మసూద్ పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ త‌దిత‌రులు మ‌రోసారి వారి పాత్ర‌ల‌తో మెప్పించ‌బోతున్నారు. లడఖ్, చెన్నై, కొట్టాయం, యూఎస్ మరియు యూకేతో సహా ప‌లు చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. టీమ్ ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటోంది. 

త్వ‌ర‌లోనే గుజరాత్, యూఏఈకి కూడా టీమ్ వెళ్లనుంది. 2025లో మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మోహ‌న్ లాల్‌, టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌:  లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్‌, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబ‌వూర్‌, నిర్మాత‌లు: సుభాస్క‌ర‌న్‌, ఆంటోని పెరుంబ‌వూర్‌, సినిమాటోగ్రఫీ:  సుజిత్ వాసుదేవ్‌, మ్యూజిక్‌:  దీపిక్ దేవ్‌.

Prithviraj Sukumaran
L2: Empuraan
Lyca Productions
Mohanla
Zayed Masood
Cinema

More Telugu News