Chip Based Blood Test: ఈ చిప్ తో కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు ముప్పును పసిగట్టవచ్చు!

Chip based blood test will find heart attack chances in minutes
  • జాన్ హాప్కిన్స్ వర్సిటీ పరిశోధకుల వినూత్న సృష్టి
  • నానో టెక్నాలజీ సాయంతో సరికొత్త రక్తపరీక్ష
  • 5 నుంచి 7 నిమిషాల్లోనే ఫలితం వెల్లడి
శాస్త్రవేత్తలు కొత్త తరహా రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. ఒక చిన్న చిప్ సాయంతో నిర్వహించే ఈ రక్తపరీక్షతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కొన్ని నిమిషాల్లోనే పసిగట్టవచ్చట. 

ఈ చిప్ ఆధారిత రక్తపరీక్షను అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే ఈ బ్లడ్ టెస్టు పూర్తవుతుంది. ఇతర టెస్టులకు గంటల కొద్దీ సమయం పడుతుండగా, ఈ టెస్టుతో నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 

ఈ బ్లడ్ టెస్టు కోసం హాప్కిన్స్ వర్సిటీకి చెందిన సహాయ పరిశోధక శాస్త్రవేత్త పెంగ్ ఝెంగ్, ఆయన బృందం ఒక చిన్న చిప్ ను రూపొందించింది. ఇందులో నానో టెక్నాలజీ వినియోగించారు. 
Chip Based Blood Test
Heart Attack
Johns Hopkins University
USA

More Telugu News