Borugadda Anil: నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్?
- గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలపై నోరుపారేసుకున్న అనిల్
- కూటమి ప్రభుత్వం వచ్చాక అజ్ఞాతంలోకి!
- నల్లపాడు పీఎస్ లో అనిల్ ను రహస్యంగా విచారిస్తున్న పోలీసులు!
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లపాడు పీఎస్ లో బోరుగడ్డ అనిల్ ను రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపి అనుకూల వ్యక్తిగా, జగన్ వీరాభిమానిగా బోరుగడ్డ అనిల్ కు గుర్తింపు ఉంది. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలను ఉద్దేశించి బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కల్యాణ్ వంటి నేతలను కూడా ఇష్టంవచ్చినట్టు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గుంటూరులో అతడిపై పలు కేసులు ఉన్నాయి! అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.