Indian Railways: రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌కు సంబంధించి కీలక మార్పు!

Indian Railways advance booking sees a massive change
  • రైల్వే అడ్వాన్స్ బుకింగ్‌ను 60 రోజులకు కుదించిన భారతీయ రైల్వే
  • ప్రస్తుతం 120 రోజులుగా ఉన్న నిబంధన
  • నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధన
అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌కు సంబంధించి ఇండియన్ రైల్వేస్ కీలక మార్పు చేసింది. దీపావళి పండుగకు ముందు ఈ కీలక మార్పును ప్రకటించింది. రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌ను 60 రోజులకు కుదించింది. ఇప్పటివరకు ఇది 120 రోజులుగా ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నిర్ణీత సమయానికి 120 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

అయితే నవంబర్ 1వ తేదీ నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే నవంబర్ 1వ తేదీకి ముందు బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది.

తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ సమయం ఇప్పటికే తక్కువగా ఉంది. అదే సమయంలో విదేశీయులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సమయం కొనసాగుతుందని వెల్లడించింది.
Indian Railways
Ticket Booking
IRCTC

More Telugu News