Telangana: ఈ నెల 21 నుంచి దక్షిణ కొరియా పర్యటనకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

TG ministers and MLAs to visit Seol from 21 to 24
  • మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి సియోల్ పర్యటన
  • ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు పర్యటన
  • సియోల్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని పరిశీలించనున్న బృందం
మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు త్వరలో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్‌లో పర్యటిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా పర్యటించనున్నారు. సియోల్‌లో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

ఈ పర్యటనకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, 12 మంది ఎమ్మెల్యేలు,  మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్‌తో పాటు మరో ఆరుగురు అధికారులు కూడా వెళ్లనున్నారు. 
Telangana
Seoul
South Korea
Hyderabad
Congress

More Telugu News