Tamannaah Bhatia: ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన న‌టి త‌మ‌న్నా.. కార‌ణం ఏంటంటే..!

Enforcement Directorate Enquiry Tamannaah Bhatia
  • మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ విచార‌ణ‌కు త‌మ‌న్నా
  • క్రిప్టోక‌రెన్సీల మైనింగ్ పేరిట ప‌లువురిని మోసం చేసిన నిర్వాహ‌కులు
  • ఈ వ్య‌వ‌హారంలో హెచ్‌పీజ‌డ్ టోకెన్ యాప్ పాత్ర
  • యాప్ కంపెనీ నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు త‌మ‌న్నాకు కొంత న‌గ‌దు
  • ఆమె వాంగూల్మం న‌మోదు చేసిన ఈడీ
మ‌నీలాండ‌రింగ్ కేసులో ప్ర‌ముఖ న‌టి త‌మ‌న్నా భాటియా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. బిట్‌కాయిన్లు, ఇత‌ర క్రిప్టోక‌రెన్సీల మైనింగ్ పేరిట ప‌లువురిని మోసం చేసిన వ్య‌వ‌హారంలో హెచ్‌పీజ‌డ్ టోకెన్ యాప్ పాత్ర ఉంది. 

ఈ కేసులో వెలుగులోకి వ‌చ్చిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి ఆరోప‌ణ‌ల‌పై త‌మ‌న్నా వాంగూల్మం న‌మోదు చేసిన‌ట్లు ఈడీ తెలిపింది. యాప్ కంపెనీ నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు త‌మ‌న్నా కొంత న‌గ‌దు తీసుకున్నారు. అయితే ఆమెపై ఎలాంటి నేరారోప‌ణ అభియోగాలు మోప‌లేద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 
Tamannaah Bhatia
Enforcement Directorate
Money Laundering Case

More Telugu News