Yahya Sinwar: హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ చివరి క్షణాలు.. వీడియో ఇదిగో!

Hamas Chief Yahya Sinwar Last Moments Viral Video
  • ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల సూత్రధారి సిన్వరే
  • దాడి చేసి మట్టుబెట్టిన ఇజ్రాయెల్
  • డ్రోన్ వీడియోను విడుదల చేసిన ఇజ్రాయెల్
  • తనను చిత్రీకరిస్తున్న డ్రోన్‌పై వస్తువు విసిరిన సిన్వర్
హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్‌ను హతమార్చిన ఇజ్రాయెల్.. ఆయన చివరి క్షణాలకు సంబంధించిన డ్రోన్ వీడియోను తాజాగా ఎక్స్‌లో షేర్ చేసింది. బాంబుదాడిలో పూర్తిగా ధ్వంసమైన భవనంలో శిథిలాల మధ్య సిన్వర్ ముఖానికి ముసుగుతో కుర్చీలో కూర్చున్నాడు. తనను చిత్రీకరిస్తున్న డ్రోన్‌ను చూసిన ఆయన తన చేతిలో ఉన్న వస్తువును డ్రోన్‌పైకి విసిరాడు. అది డ్రోన్‌కు తగిలి కదిలింది.

గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్‌లో 62 ఏళ్ల సిన్వర్ హతమయ్యాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్).. ‘ఎలిమినేటెడ్: యహ్వా సిన్వర్’ అని రాసుకొచ్చింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి సూత్రధారి సిన్వరేనని, ఐడీఎఫ్ ఆయనను అంతమొందించిందని ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి ఇజ్రాయెల్ కత్జ్ పేర్కొన్నారు.
Yahya Sinwar
IDF
Gaza Strip
Israel
Hamas

More Telugu News