MVV Satyanarayana: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఈడీ దాడులు

ED raids on YSRCP Ex MP MVV Satyanarayana
  • విశాఖలోని ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు
  • ఎంవీవీ ఆడిటర్ ఇంట్లో కూడా తనిఖీలు
  • ప్రస్తుతం ఇంట్లో లేని ఎంవీవీ
విశాఖలో వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలో ఉన్న లాసన్స్ బే కాలనీలోని ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు... మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. 

ఆయన ఆడిటర్ జీవీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మధురవాడలో భూమి కొనుగోళ్లకు సంబంధించి తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎంవీవీ ప్రస్తుతం ఇంట్లో లేరని ఈడీ అధికారులు చెపుతున్నారు. ఎంవీవీ తెలుగులో పలు చిత్రాలను కూడా నిర్మించారు.
MVV Satyanarayana
YSRCP
Enforcement Directorate

More Telugu News