Harish Rao: బండి సంజయ్ నిరసన తెలిపితే అడ్డుకోలేదు... మావాళ్లను అరెస్ట్ చేశారు: హరీశ్ రావు

Harish Rao blames Congress party for arresting brs leaders
  • గ్రూప్-1 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు
  • శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్, దాసోజ్ శ్రవణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • బండి సంజయ్ గంటల పాటు నిరసన తెలిపినా అడ్డుకోలేదన్న హరీశ్ రావు
  • బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం బట్టబయలైందన్న మాజీ మంత్రి
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ వచ్చి గంటలపాటు నిరసన తెలియజేస్తుంటే అడ్డుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపితే మాత్రం అరెస్ట్ చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్‌ను హరీశ్ రావు ఖండించారు. 

బండి సంజయ్ గంటలపాటు నిరసన తెలిపినా అడ్డుకోలేదని, కానీ తమ పార్టీ నేతలను వెంటనే అరెస్ట్ చేయడంతోనే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న చీకటి ఒప్పందం బట్టబయలైందన్నారు. బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. రాజకీయాలు పక్కనబెట్టి ముందు విద్యార్థుల సమస్య పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆపాలని హరీశ్ రావు హితవు పలికారు.
Harish Rao
Bandi Sanjay
BRS
Congress

More Telugu News