Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాలను సందర్శించి భారీ విరాళం అందించిన కుబేరుడు ముకేశ్ అంబానీ

Mukesh Ambani offered prayers at Kedarnath and Badrinath shrines and donated huge ammount
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, భారత అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇవాళ (ఆదివారం) ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లటి కుర్తా-పైజామా, లేత గోధుమరంగు జాకెట్‌ ధరించి ఆయన ఆలయాలను సందర్శించారు. బద్రీనాథ్‌లో ముఖేశ్ అంబానీకి బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ ఘన స్వాగతం పలికారు. 

కాగా చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయం, రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం రూ.5 కోట్ల భారీ విరాళాన్ని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీకి ముకేశ్ అంబానీ అందజేశారు. గతేడాది కూడా ముఖేశ్ ఈ ఆలయాలను సందర్శించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శించారు.


Mukesh Ambani
Kedarnath
Badrinath
Uttarakhand

More Telugu News