Lovers: మనస్పర్థలతో చేయి కోసుకున్న ప్రియురాలు.. అది చూసి గుండె ఆగి మరణించిన ప్రియుడు!

Delhi man dies after seeing girlfriends self harm video
  • ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో ఘటన
  • మణికట్టు కోసుకుని ప్రియుడికి వీడియో పంపిన యువతి
  • వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చిన యువకుడు
  • బెడ్‌పై ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయి స్పృహ తప్పి పడిపోయిన ప్రియుడు
  • ఆ వెంటనే మృతి.. గుండెపోటే కారణం కావొచ్చన్న పోలీసులు
ప్రేమికుల మధ్య మనస్పర్థలు సహజం. చిన్నచిన్న భేదాభిప్రాయాలు వస్తుంటాయి. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే, ఈ ఘటనలో మాత్రం అది అపార్థంగా మారడంతో ప్రియురాలు తట్టుకోలేకపోయింది. మనస్తాపంతో మణికట్టు వద్ద గాయం చేసుకుంది. ఆసుపత్రి బెడ్‌పై ఆమెను అలా చూసిన ప్రియుడి గుండె తట్టుకోలేకపోయింది. స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో జరిగిందీ ఘటన. 

ప్రియురాలు లా చదువుతుండగా, ప్రియుడు చదువు పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవల వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అవి కాస్తా అపార్థాలుగా మారడంతో యువతి తట్టుకోలేకపోయింది. పదునైన ఆయుధంతో మణికట్టు వద్ద నరాలు కోసుకుని, ఆ వీడియోను ప్రియుడు అరుణ్ నందా (30)కు పంపింది.

ఆ వీడియోను చూసిన అరుణ్ వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితిని చూసిన అరుణ్ స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే అతడు మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Lovers
New Delhi
Girl Friend

More Telugu News