Game Changer: రామ్‌చ‌ర‌ణ్‌ 'రా మచ్చా మచ్చా'పై.. సౌత్ కొరియ‌న్ల సూప‌ర్బ్ డ్యాన్స్‌.. వీడియో షేర్ చేసిన ప్ర‌ముఖ సింగ‌ర్‌!

South Korean singer and composer Park Min jun shared the Raa Macha Macha song on his Instagram
  • రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోలో 'గేమ్ చేంజర్' 
  • సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న మూవీ విడుద‌ల
  • ట్రెండ్‌ సెట్ట‌ర్‌గా నిలిచిన చిత్రంలోని 'రా మచ్చా మచ్చా' పాట
  • ఈ పాట‌పై చ‌ర‌ణ్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌ను దించేసిన సౌత్ కొరియ‌న్లు
  • ఆ వీడియోను త‌న ఇన్‌స్టా ద్వారా పంచుకున్న సౌత్ కొరియ‌న్ సింగర్‌ పార్క్ మిన్ జున్ 
గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన రెండు పాట‌లు శ్రోతల‌ను అల‌రిస్తున్నాయి. ముఖ్యంగా 'రా మచ్చా మచ్చా' పాట అయితే ట్రెండ్‌ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ సాంగ్‌లో చెర్రీ డ్యాన్స్ సింప్లీ సూప‌ర్బ్ అని చెప్పాలి. 

తమన్, శంకర్ కలిసి ఈ పాటను నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసినట్టుగానే కనిపిస్తోంది. వెయ్యి మందికి పైగా ఫోక్ డ్యాన్సర్లతో ఈ పాటను స్పెషల్‌గా పిక్చరైజ్ చేయించార‌ట ద‌ర్శ‌కుడు శంకర్. ఇక బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు అద్భుత‌మైన‌ కొరియోగ్ర‌ఫీ అందించారు. దాంతో ఈ పాట‌పై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్నో రీల్స్ పుట్టుకొచ్చాయి. 

ఇదిలాఉంటే.. తాజాగా కొంద‌రు సౌత్ కొరియ‌న్లు కూడా రా మచ్చా మచ్చాపై చ‌ర‌ణ్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌ను దించేశారు. ఆ వీడియోను సౌత్ కోరియ‌న్ సింగర్‌, కంపోజ‌ర్ పార్క్ మిన్ జున్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. దాంతో ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై మెగా అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.   
Game Changer
Raa Macha Macha song
Ramcharan
Park Min-jun
South Korean

More Telugu News