Naga Chaitanya: నాగచైతన్య, శోభిత పెళ్లి పనులు షురూ

Naga Chaitanya and Shobita wedding works started
  • సమంతతో విడిపోయిన తర్వాత శోభిత ప్రేమలో నాగచైతన్య
  • ఆగస్టు 8న జరిగిన ఎంగేజ్ మెంట్
  • డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న వివాహం
అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు మొదలయ్యాయి. వైజాగ్ లోని శోభిత నివాసంలో గోధుమరాయి పసుపు దంచే కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం డిసెంబర్ మొదటి వారంలో జరగనుంది. అయితే, పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. 

సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య, శోభితలు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఫొటోలు చక్కర్లు కొట్టాయి. దీంతో, ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ వార్తలు నిజమేనని నిరూపిస్తూ... గత ఆగస్టు 8న వీరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో నాగార్జున షేర్ చేశారు.
Naga Chaitanya
Shobita
Marriage
Tollywood

More Telugu News