Prabhas: నా 'ఉచ్ఛ్వాసం కవనం' టాక్ షోకి హాజరైన ప్రభాస్

prabhas guest in naa uchvasam kavanam promo
  • ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమంలో సందడి చేసిన ప్రభాస్
  • మెల్లగా .. గరగనీ ..అంటూ మెలోడో సాంగ్ పాడుతుంటే నా గుండె ఆగినంత పనైందన్న ప్రభాస్
  • రొమాన్స్‌ కూడా సిరివెన్నెల ఎంతో బ్యూటీ ఫుల్‌గా రాసేవారని కొనియాడిన ప్రభాస్
అగ్రశ్రేణి కథానాయకుల్లో ఒకరైన ప్రభాస్ వేదికలపై పాల్గొని మాట్లాడటం చాలా తక్కువ. అలానే ఇంటర్వ్యూలు, టాక్ షోలకు దూరంగానే ఉంటారు. అలాంటి ప్రభాస్ తాజాగా ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి హజరై సందడి చేశారు. లెజండరీ సినీ గేయ రచయితతో తమకు ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ సినీ తారలు పంచుకుంటున్న జ్ఞాపకాల వేదికగా  ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమాన్ని ఈటీవీ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రసారం చేస్తోంది. ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ లోనూ స్ట్రీమింగ్ కానుంది. 

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభాస్ .. సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన ప్రతిభను కొనియాడారు. మొదటిసారి ఆయనతో పరిచయం అయిన సందర్భంలో 'మెల్లగా .. గరగనీ ..' అంటూ మెలోడో సాంగ్ పాడుతుంటే నా  గుండె ఒక్క సారిగా ఆగిపోయినంత పని అయిందన్నారు. రొమాన్స్‌ కూడా ఆయన ఎంతో బ్యూటీ ఫుల్‌గా రాసేవారని అన్నారు. సాహిత్యం అందం..అర్ధంతో పాటు, రాసేవాళ్లకు ఉన్న విలువ ఏంటో తెలియజెప్పిన వ్యక్తి సిరివెన్నెల అని ప్రభాస్ కొనియాడారు.  
   
Prabhas
naa uchvasam kavanam
Movie News

More Telugu News