Drone Show: ఐదు ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన విజయవాడ డ్రోన్ షో

Vijayawada Drone Show creates history with five world records
  • విజయవాడలో ఘనంగా డ్రోన్ షో
  • వివిధ కళాకృతులతో ఆకట్టుకున్న ఈవెంట్
  • మరెక్కడా లేని విధంగా డ్రోన్ షో గ్రాండ్ సక్సెస్
  • చంద్రబాబుకు రికార్డులకు సంబంధించి సర్టిఫికెట్ల అందజేత
కేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహించిన డ్రోన్ షో విజయవంతం అయింది. డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్ లో డ్రోన్ విన్యాసాలు అచ్చెరువొందించాయి. 

ఇక అసలు విషయానికొస్తే... ఈ డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. తద్వారా విజయవాడ డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేశారు. 

1. డ్రోన్లను ఉపయోగించి అతి పెద్ద భూగోళం ఆకృతి 2. అతి పెద్ద ల్యాండ్ మార్క్ 3. అతి పెద్ద విమానం 4. అతి పెద్ద జాతీయ జెండా 5. ఏరియల్ లోగో... ఇలా విజయవాడ డ్రోన్ షో ఐదు అంశాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.
Drone Show
World Records
Guinness Book
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
Vijayawada
Andhra Pradesh

More Telugu News