Anuradha: ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం

Former IPS Officer Anuradha Appointed as APPSC Chairperson
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్
  • గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన అనురాధ
  • గౌతమ్ సవాంగ్ రాజీనామా తర్వాత ఖాళీగా ఉన్న ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధను ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనురాధ గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

గత వైసీపీ ప్రభుత్వం గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనంతరం ఈ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా అనురాధను ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Anuradha
Andhra Pradesh
Telugudesam
APPSC

More Telugu News