korean companies: ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో కొరియా సంస్థల ప్రతినిధుల భేటీ
- వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు
- ఏపీలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను వివరించిన మంత్రి లోకేశ్
- పెట్టుబడులకు సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నామని కొరియా సంస్థల వెల్లడి
ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో చెన్నైలోని దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ కిమ్ చాంగ్ యున్‌తో పాటు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ కొరియా ఈడీసీఎఫ్ ప్రతినిధులు కెవిన్ చోయ్, జంగ్ వాన్ రియూ తదితరులు భేటీ అయ్యారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులకు మంత్రి లోకేశ్ వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలని లోకేశ్ విజ్ఞప్తి చేస్తూ.. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల మంజూరుకు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరించామని వివరించారు.