Ongole: మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెతో పరార్

Man live in relation with woman fled with her daughter
  • ఏపీలోని గుంటూరులో ఘటన
  • కుమార్తెతో కలిసి జీవిస్తున్న మహిళతో సహజీవనం
  • ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి హైదరాబాద్‌కు
  • బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడి ఆటకట్టు
మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపైనా కన్నేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడో కామాంధుడు. ఒంగోలులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. విభేదాల కారణంగా ఓ మహిళ పదో తరగతి చదువుతున్న కుమార్తెతో కలిసి ఓ గ్రామంలో విడిగా నివసిస్తోంది. తనకు పరిచయమైన టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్ల రాజుతో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.

ఈ క్రమంలో అతడి దృష్టి బాలికపైనా పడింది. ఆమెను రోజూ స్కూలుకు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. స్కూలుకెళ్తున్నట్టు చెప్పి రెండ్రోజుల క్రితం ఇద్దరూ బయటకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలికను నిందితుడు హైదరాబాద్ తీసుకెళ్లినట్టు గుర్తించారు. అనంతరం హైదరాబాద్ నుంచి ఇద్దరినీ ఒంగోలు తీసుకొచ్చారు. నిందితుడు రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Ongole
Crime News
Andhra Pradesh

More Telugu News