Amit Shah: అమిత్ షాతో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ

Omar Abdullah Meets Amit Shah In Delhi To Discuss JK Statehood Issue
  • జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై ఇరువురి మధ్య చర్చ
  • సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఒమర్ ఢిల్లీ పర్యటన
  • రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ఒమర్ అబ్దుల్లాకు అమిత్ షా హామీ?
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కలిశారు. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను కల్పించాలనే అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఒమర్ అబ్దుల్లా గతవారం సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి ఆయన దేశ రాజధానిలో పర్యటించారు. అమిత్ షాతో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు.

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ జమ్మూకశ్మీర్ కేబినెట్ ఇటీవల తీర్మానం చేసింది. ఈ విషయమై చర్చించేందుకు నిన్న సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణపై అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఒమర్ అబ్దుల్లా నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
Amit Shah
Omar Abdullah
BJP
Jammu And Kashmir

More Telugu News