Chiranjeevi: చిరంజీవిని కలిసిన నాగార్జున

Nagarjuna invites Chiranjeevi to ANR National Award 2024 ceremony
  • 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం
  • ఈ ఏడాది తమకు ఎంతో ప్రత్యేకమని ట్వీట్ చేసిన నాగార్జున
  • అమితాబ్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారం అందుకోనున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. ఈ నెల 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి మెగాస్టార్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది తమకు చాలా ప్రత్యేకమని, తన తండ్రి శతజయంతి వేడుకలకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి‌ని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. వారి రాక తమకు మరింత గౌరవంగా మారనుందని పేర్కొన్నారు. ఈ వేడుకను మరుపురానిదిగా చేద్దామని రాసుకొచ్చారు.

అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారం అందుకోనున్నారు. చిరంజీవిని వేడుకకు ఆహ్వానిస్తున్న ఫొటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
Chiranjeevi
Nagarjuna
ANR Awards
Telangana
Andhra Pradesh
Tollywood

More Telugu News