Israel: ఇరాన్‌పై వందలాది యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో ఇదిగో!

Israel attack on Iran with hundreds of fighter jets
  • ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్
  • తాజాగా ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
  • ఇరాన్ రక్షణ వ్యవస్థ, ఆయుధగారాలే లక్ష్యంగా దాడులు
  • తమకు పెద్దగా నష్టం జరగలేదన్న ఇరాన్
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వందలాది విమానాలతో ఈ తెల్లవారుజామున భీకర దాడులు జరిపింది. ఈ దాడుల నేపథ్యంలో జరిగిన పేలుళ్లతో టెహ్రాన్ చిగురుటాకులా కంపించింది. ఇజ్రాయెల్ విమానాలు వేసిన బాంబులు దీపావళి రోజున ఆకాశంలో పేలిన టపాసులను తలపించాయి. అయితే, ఇజ్రాయెల్ దాడుల వల్ల తమకు పరిమితంగానే నష్టం వాటిల్లినట్టు ఇరాన్ స్పష్టం చేసింది.

పశ్చిమాసియాలో నెలకొన్నఉద్రిక్తతలకు తోడు తాజా దాడుల నేపథ్యంలో యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాడుతోంది. 1980లో ఇరాక్‌తో యుద్ధం తర్వాత ఇరాన్‌పై ఇజ్రాయెల్ బహిరంగంగా దాడులకు దిగడం ఇదే తొలిసారి.

ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడిచేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ ఇప్పుడు వందకుపైగా యుద్ధ విమానాలతో ఇరాన్‌పై విరుచుకుపడింది. మూడు దఫాలుగా ఇజ్రాయెల్ దాడికి దిగింది. తొలిసారి ఇరాన్ రక్షణ వ్యవస్థపై, రెండు, మూడోసారి ఇరాన్ ఆయుధగారాలపై దాడులు చేసింది. ఇవి ప్రతీకార దాడులేనని ఇజ్రాయెల్ పేర్కొంది.
Israel
Iran
Tehran
Fighter Jets
War

More Telugu News